Take a fresh look at your lifestyle.

రాజీ మార్గమే – రాజ మార్గం…..

0

ఈ నెల 21న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలి

రాజీ మార్గమే – రాజ మార్గం

నిజామాబాద్, డిసెంబర్ , 18 ( లోకంతీరు ) : రాజీమార్గమే – రాజమార్గమని ఈనెల 21న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగ పరచుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క లోక్ అదాలత్ ను ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి  భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 21 నాడు నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలకు కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో చిన్నచిన్న కేసులు , ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు మెగా లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చు అని తెలిపారు. ఇది ఒక శాంతియుత పరిష్కార విధానం కాబట్టి పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కోర్టులో గల కేసులలో త్వరగా పరిష్కారం చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు .

Leave A Reply

Your email address will not be published.