ప్రజా పాలన తో ప్రజలు సంతోషం గా ఉన్నారు
— జిల్లా కాంగ్రెస్ నాయకులు అంబాయి ప్రసాద్
— ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలతో అపూర్వ స్పందన–
– ప్రభుత్వ ధ్యేయం ఆరు సంక్షేమ పథకాలు అమలు

కామారెడ్డి ప్రతినిధి, డిసెంబర్ 29 (లోకంతీరు) : ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టతమకంగా తీసుకున్న 6 గ్యారంటిలు,ఎల్లారెడ్డి నియొజ కవర్గ ఎమ్మెల్యే మదన్ మొహన్ రావు ఆదేశాలతో ఎల్లారెడ్డి కాంసెన్సీలో ప్రజల నుండి అపూర్వ స్పందన అపూర్వం గా ప్రజా ఆదరణ వస్తుంది.ప్రజల కొరకు ప్రజల భవిష్యత్తు రూపురేఖలు మార్చాలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల మేనిఫెస్టో లో భాగంగా ప్రజా పలానా కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రజాధరణ పొందుతుంది. లబ్ధిదారులందరూ సంతోషంతో ప్రభుత్వ సంక్షేమాల కొరకు ఆర్జీలు పెట్టుకున్నారు.కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది. ఇలాగే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజలు ఎవరు కూడా ధైర్య పడవద్దు కాంగ్రెస్ ధ్యేయం ప్రభుత్వ లక్ష్యం.టిపిసిసి కామారెడ్డి జిల్లా నాయకుడు మాట్లాడుతూ…!గ్రామ ప్రజలు అత్యధికంగా 6 గ్యారంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఇకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సుఖసంతోషాంగా ఉండాలని ఉద్దేశంతో ఇంటింటా ఇందిరమ్మ సర్వే పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలు ఉండకుండా, సమస్యలు తలెత్తకుండా అధికారులు గానీ, ఆయా శాఖ సిబ్బంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకం ప్రవేశపెట్టబోతోంది. ఈ యొక్క సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు మరికొంత ఇబ్బందులు తొలిగేవిధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకం ప్రారంభం చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఈ సంక్షేమ పథకాలు అందాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని సంక్షేమ పథకాలలోని సమస్యలు త్వరలోనే తీరుతాయని ప్రజలు ఆధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు.ఈ ప్రభుత్వం నూతనంగా ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని, ఈమధ్య అనథికాలంలోనే అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ శభాష్ తెలంగాణ ప్రభుత్వం అని మెచ్చుకొని తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, పేద మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా అందర్నీ ఆదరించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని ఉంది. గత బిఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అనడంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా ఈ అనధికారంలో ప్రవేశపెట్టే ఇందిరమ్మ ఇళ్ల సర్వే లో లబ్ధిదారులు, ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకూడదు అదేవిధంగా ప్రజలు మధ్యవర్తులను నమ్మకుండా ఉండాలని అన్నారు.ముఖ్యంగా అలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పదు అని జిల్లా సీనియర్ నాయకులు అంబాయి ప్రసాద్ అన్నారు.