Take a fresh look at your lifestyle.

పిట్లంలో ఎటిఎం చోరీ……

0

పిట్లంలో ఎటిఎం చోరీ

బాన్సువాడ ,జనవరి 12 ( లోకంతీరు ) : ఎటిఎం దొంగలు రెచ్చిపోయారు.ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న SBI ఎటిఎం లో చోరికి పాల్పడ్డారు.ఎటిఎం ను ద్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును అపహరించారు.ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని SBI ఎటిఎం లో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారు జామున ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు ఎటిఎం లోకి ప్రవేశించాడు. ముందుగా ఏటీఎం లోని సీసీ కెమెరాపై స్ప్రే చేసిన అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఎటిఎం ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న సుమారు 17 లక్షల భారీ నగదును అపహరించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు.అయితే గతంలో బిచ్కుంద పట్టణంలో సైతం ఏటీఎం మిషన్ ను ఇదే విధంగా ధ్వంసం చేసిన ఘటన జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి ఉంది. 161 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పట్టణాలలోని ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చి పోతుండడం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది.

Leave A Reply

Your email address will not be published.