Take a fresh look at your lifestyle.

అక్రమ భూ కబ్జాలు అడ్డొస్తే అట్రాసిటీ కేసులు…

0

అక్రమ భూ కబ్జాలు అడ్డొస్తే అట్రాసిటీ కేసులు

– భూకబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలి

– మీడియా సమావేశంలో బాధితుల ఆవేదన

నిజామాబాద్, మే 31 ( లోకంతీరు ) : తమ భూముల్ని అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతూ అడ్డుకుంటున్న తమపై అట్రాసిటీ కేసులు బనాయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ బాధితులు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమి యాజమాని సింహాద్రి వెంకటేశ్వర్ రావు, మాట్లాడుతూ తమకు నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం మద్దేపల్లి గ్రామ శివారులో 7 ఎకరాల 35 గుంటల భూమి మాకు ఉండేదని, మా భూమిని కాట్రోత్ రవికుమార్ అనే వ్యక్తి కబ్జాకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. మాభూమిలోకి వెళ్లి మేము పొలం వేసుకున్న మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వేసిన పొలాన్ని కోసుకొని మరీ అమ్ముకున్నారని, ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, బాధితుడు ఆరోపించారు. మా భూమి సర్వే నెంబర్ 193,194,195,189,199 లో 5 ఎకరాల 17 గుంటలు భూమిని కట్రోత్ రవి, వాళ్ళ తండ్రి ని మేము 2005 వ సంవత్సరంలో అమ్మినాము అన్నారు. మిగిలిన 2 ఎకరాల 8 గంటల భూమిని ఆయన కబ్జా చేసుకున్నారని బాధితులు తెలిపారు. ధరణిలో ఎమ్మార్వోలు చేసిన తప్పుల వలన, మాకు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.మాపై అన్ని మీడియాలలో తప్పుడు కథనాలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మద్దని అన్నారు.మాకు జీవనాధారం ఈ భూమి తప్ప, వేరే ఏమీ లేదని. అడ్డొస్తే మా పైన అట్రాసిటీ కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు., అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మా పరిస్థితులను చూసి మాకు న్యాయం చేసేలా చూడాలని బాధితులు విజ్ఞప్తి చేశారు..

Leave A Reply

Your email address will not be published.