సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు

ఎడపల్లి జూన్ 26 ( లోకంతీరు ) : వర్ష కాలం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ జూలై మాసాలలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎడపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు కావలసిన మందులు మాత్రాలను పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఈగ వినీత్ కుమార్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆయన స్థానిక వైద్య సిబ్బందితో పాటు ఆశ వర్కర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారుజూలై మాసంలో అధికంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు రోగులకు మందులు మాత్రాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారుఇంటి పరిసరాల పరిశుభ్రతపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, కలరా ఇతర భయంకరమైన వ్యాధుల నుండి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాలలోని ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు గ్రామాలలో పర్యటించి ప్రజల ఆరోగ్య విషయాలపై అడిగి తెలుసుకోవాలన్నారుక్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఎక్కడైనా మురికి నీరు ఆగి ఉన్నచోట అలాగే పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారుప్రతిరోజు ఏఎన్ఎం లతోపాటు ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కోరారుఈ వర్షాకాలం జూన్ జూలై మాసంలో ఈగలు అత్యధికంగా సంతరిస్తున్నందున ఇంట్లో ఉన్న వంట పాత్రలపై మూతలు ఉండే విధంగా ఇంటి యజమానులకు మహిళలకు అవగాహన చేయాలన్నారు ఈగలు దోమలు వాలిన భోజనాన్ని కానీ మంచినీటిని కానీ తిన్న, తాగినట్లయితే వాంతులు విరేచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ అధికారుల ఆదేశాల మేరకు ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం సీజనల్ వ్యాధుల నివారణ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి వినీత్ కుమార్ రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా వచ్చిన జాబితాలను పరిశీలించిన అనంతరం నివేదికలను జిల్లా వైద్య శాఖ అధికారికి,జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఆయుష్ విభాగం వైద్యాధికారి వెంకటేష్, పర్యవేక్షకులు రాజేశ్వర్, నాగరాజ్, ల్యాబ్ ఆపరేటర్ కృష్ణమోహన్, స్టాఫ్ నర్స్ సుమలత, సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.