Take a fresh look at your lifestyle.

నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం ….

0

నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం 

— డాక్టర్ సురేష్

 

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 10 ( లోకంతీరు ) : నులి పురుగులు, కొంకి పురుగులు, కొరడా పురుగులు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు.. ఇలా పొట్టలో చేరి అనేక రోగాలకు కారణమవుతుంటాయి. వీటి నివారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది రెండుసార్లు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సోమవారం ఆగస్టు 11న మాత్రలు వేస్తారు. వైద్యాధికారి మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం మాప్ ఆప్ కార్యక్రమంలో 1నుండి 2సంవత్సరముల పిల్లలకు సగం మాత్ర,2 నుండి 3సంవత్సరముల పిల్లలకు పూర్తి మాత్ర చెంచలో పొడిచేసి నీళ్లలో కలిపి అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ త్రాగించవలెను.3 నుండి 19 సంవత్సరముల పిల్లలకు మాత్ర నమిలి చప్పరించిన తరువాత నీరు త్రాగవలెను. ఏ ఈ ఎఫ్ ఐ,మాత్ర మింగిన తర్వాత ఏ రకమైన దుష్పరిమాణాలు వచ్చినచో వెంటనే సంబంధిత ఆరోగ్య సిబ్బందికి మరియు వైద్యాధికారికి తెలియజేసి 108, ఆర్బిఎస్ కే , ఎం హెచ్టి వాహనం ద్వారా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలి.ఆల్బెండజోల్ మాత్ర ఆహారము తీసుకున్న తరువాతనే ఇవ్వవలెను.మాత్ర ఇంటి దగ్గర వేసుకునుటకు ఇవ్వకూడదు ఖాళీ కడుపుతో ఉన్నవారికి ఇవ్వకూడదు.పాఠశాలలు, కాలేజీలలో పిల్లలకు సంబంధిత ఉపాధ్యాయని ,ఉపాధ్యాయులు మాత్రలు విద్యార్థులకు దగ్గరుండి మిగించవలెను,అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అంగన్వాడి టీచర్ మాత్రలు చిన్నపిల్లలకు తగువిధంగా మాత్రలు మింగించవలెను. అని వైద్యాధికారి పలు సూచనలు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.