Take a fresh look at your lifestyle.

ప్రపంచంలో లయన్స్ క్లబ్ సేవలో ముందు …..

0

Lions Club is the world’s leading service…

ఎడపల్లి , ఆగస్టు 18 ( లోకంతీరు ) : ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎదుటివారికి సహాయం చేసినప్పుడే జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని లైన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ భారత దేశ ప్రతినిధి ఘట్టమనేని బాబురావు అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాదులోని కెవిఆర్ కన్వెన్షన్ లో జరిగిన లయన్ అమర్నాథ్ నూతన డిస్ట్రిక్ట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలైన హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 149 లయన్స్ క్లబ్ లో, ఇందులో పాల్గొన్నాయి. నూతన డిస్ట్రిక్ట్ గవర్నర్గా అమర్నాథ్ రావు తో పాటు 350 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఘట్టమనేని బాబురావు మాట్లాడారు. నేడు ప్రపంచంలో లయన్స్ క్లబ్ లో సేవలో ఎంతో ముందు ఉందని అన్నారు. సామాజిక సేవలతో పాటు ఉచిత కంటి వైద్య శిబిరాలు, రకదాన శిబిరాలు, నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా లయన్స్ క్లబ్సేవలు అందిస్తుందని అన్నారు. మనిషికి సమాజ సేవ చేయాలన్న సంకల్పం లైన్స్ క్లబ్ తో తీరుతుందని అన్నారు. డబ్బులు అందరి దగ్గర ఉన్న పేదలకు వాటితో సేవ చేయాలన్న సంకల్పం ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహక అధ్యక్షుడు లయన్ బసవేశ్వర రావు, ప్రతినిధులు నాగరాజు, సూర్యనారాయణ, విజయలక్ష్మి, సూర్యారావు, ఎడపల్లి క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత, ప్రతినిధులు కదం ప్రకాష్, బంజ శంకర్, జంగారెడ్డి, మెరిసే, మనోజ్, వర్మ తదితరులు ఉన్నారు.

lokamteeruEdit Profile

Leave A Reply

Your email address will not be published.