నేటి నుండి ఇందిరా గాంధీ మహిళ శక్తి చీరలు పంపిణీ
ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో నేటి ( ఆదివారం) నుంచి ఇందిరా గాంధీ మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎడపల్లి మండల ఐకెపి ఎపిఎం రాజేందర్ తెలిపారు.ప్రభుత్వం ద్వారా మంజూరైన (సరఫరా) ఆయన చీరలను మండలంలోని 17 గ్రామ పంచాయితీల కు, స్థానిక స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆ గ్రామానికి ఎన్ని చీరలు మంజూరయ్యాయో వాటిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. శనివారం ప్రభుత్వం ద్వారా సరఫరా అయిన చీరలను వెనువెంటనే గ్రామాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డిఆర్డిఏ పిడి సాయ గౌడ్, ఆదేశాల మేరకు నేడు (ఆదివారం) నుంచి ఎడపల్లి మండలంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎడపల్లి మండలానికి 12, వేల,120 చీరలు మంజూరయ్యాని (సరఫరా) ఆయన తెలిపారు.18 సంవత్సరాలు నిండిన మహిళ యువతి నుండి ఆ పై ప్రతి మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చీరాల పంపిణీ కార్యక్రమంలో ఐకెపి సిసి ఎస్తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామాల వివోఏలు, గ్రామ పెద్దల సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. చీరలు లబ్ధి పొందే మహిళలు ఆధార్ కార్డు తమ వెంట తీసుకునిసంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాలకు చేరుకోవాలని అన్నారు, ఆన్లైన్లో కంటి ధ్రువీకరణ ద్వారా గుర్తించిన తర్వాతనే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. గ్రామ పెద్దలు గ్రామ సంఘాల వివోఏలు సంఘ బాధ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా మహిళలకు చీరలను అందజేయాలని ఆయన కోరారు.ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.