రెంజల్ మండలం కందకుర్తి , తాడ్ బిలోలి వెళ్లే రోడ్డు మార్గాలను సందర్శించిన పోలీస్ కమిషనర్

ఎడపల్లి , ఆగస్టు 29 ( లోకంతీరు ) : గత రెండు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ కెనాల్ నుంచి అదే విధంగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా కందకుర్తి గోదావరి బ్రిడ్జి మరియు పుష్కర ఘాట్లను మరియు వరద ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ శుక్రవారంబోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జి ను గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., గారు పర్యవేక్షించడం జరిగిందిఈ సందర్భంగా కందకుర్తి లో గల ఎగువన నిజాంసాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జి గోదావరి బ్రిడ్జి నుంచి భారీగా వస్తున్న వరద కందకుర్తి చుట్టుపక్కల ప్రాంతాలను ముంపుకు గురైన దానిని మరియు చుట్టుపక్కల వరద ప్రాంతాలను పర్యవేక్షించినారు.అదేవిధంగా వరద నీరు తాడిబిలోని దగ్గర్లో గల బైంసా నుంచి బాసర బోయ రోడ్డుపై నుంచి వరద నీరు పారుతున్న దాన్ని కూడా పర్యవేక్షించారుఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. ఏదైనా కూలిపోయే స్థితిలో గల ఇళ్ళను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలైన గవర్నమెంట్ స్కూల్లో వాళ్లను షెల్టర్ తీసుకోవాలని చెప్పేసి ప్రజలను కోరడమైనది.ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయ్ బాబు, రెంజల్ SI శ్రీ కె. చంద్ర మోహన్ , మండల తహసిల్దార్ సావన్ గారు తదితరులు ఉన్నారు