రామారెడ్డి గ్రామం సుమారు 48 గంటలు జలదిగ్బంధం

— ప్రజల శ్రేయసు కొరకు బార్కెట్లు ఏర్పాటు
— నిరాశ్రయులకు ఆహారం అందజేత
— శిథిలావస్థ గృహాల పరిశీలన
— ముందస్తు భద్రత తో విద్యుత్ శాఖ
— రెవెన్యూ, ఎంపీడీవో, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ,
— ఇతర శాఖల అనుసంధానం
కామారెడ్డి , ఆగస్టు 29 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో భారీ నుండి అతి భారీగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు చెరువులు కుంటలు జలమయమై పొంగిపొర్లుతున్నాయి. అదేవిధంగా వాగులు వంకలు నీళ్లతో పొంగిపొర్లుతూ పంట పొలాలు నీట మునిగాయి, ఇసుక తిట్టలతో పంట పొలాలు బీటలుగా మారిన వైనం, రామారెడ్డి గ్రామానికి సంబంధించిన ప్రధాన రహదారి కామారెడ్డి వెళ్లే దారి గత రెండు రోజుల నుండి మూసివేత, చుట్టుపక్కల వేరే గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ రోడ్లు బాగు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్న వైనం. అదేవిధంగా భారీ వర్షానికి పాక్షికంగా, మరికొన్ని నిరుపయోగంగా కూలిపోయిన నివాస గృహాలు, వాటిని పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం, జలదిగ్బంధంలో ఇరుక్కోకుండా ప్రజలను కాపాడడానికి పహార కాస్తున్న పోలీస్ సిబ్బంది. ఇంతకీ అకాల వర్షానికి కూలిపోయిన గృహాలకు నష్టపరిహారం అంతేనా…? అదేవిధంగా నీట మునిగిన వరి పొలాలకు పంట నష్ట పరిహారం వ్యవసాయ శాఖ అంచనా వేస్తుందా..? రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తుందా లేదా అని బాధితులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా నిర్వాసితులైన కుటుంబాలు వసతి గృహాలలో ఆశ్రయం పొందుతున్నారు. వారికి రెవెన్యూ, ఎంపీడీవో, అధికారులు శానిటేషన్, మంచినీరు, బట్టలు, నిత్యవసర సరుకులు, భోజన సదుపాయాలను సమకూర్చుతున్నారు. ముఖ్యంగా జలమయమైన రోడ్లు బాగు పడేనా..? ఇంతకీ వాటర్ ఫ్లోయింగ్ తగ్గుముఖం పట్టినప్పటికీ ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ స్థానిక ఎస్సై లావణ్య ముందస్తు భద్రతతో సిబ్బంది రోడ్లపై ప్రయాణాలు చేయకుండా ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజలు సురక్షితం గా ఉండాలని ముందు జాగ్రత్తతో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తున్నారు. భారీ పెద్ద బారికేట్లతో రోడ్లను మూసివేశారు. అయినా ప్రయాణికుల అత్యవసర పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని వాటర్ ఫ్లోయింగ్ తగిన పిదప తప్పనిసరి పరిస్థితులలో జాగ్రత్తగా నెమ్మదిగా ప్రజలకు ప్రయాణానికి సహకరిస్తున్నారు. ఈ యొక్క జలదిగ్బంధం సంబంధించిన కార్యక్రమంలో మండల అధికారులు శ్రేయ శక్తుల శ్రమించి, వారి బాధ్యతను నిలబెట్టుకున్నందుకు ప్రజల ఆదేశాల మేరకు సుమారు 48 గంటలు పనిచేసిన వైనం. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రక్షణ శాఖ, మండల అభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ అండ్ బి, పలు శాఖల అధికారులు పలుమార్లు పర్యవేక్షించి ప్రజల సంరక్షణ కొరకు ఛాయాశక్తుల కృషి చేసినందుకు వారికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.