Take a fresh look at your lifestyle.

స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ….

0

స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

ఎడపల్లి , ఆగస్టు 29 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో ఎస్సై ముత్యాల రామ,సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీ నివాస్, మాజీ సర్పంచ్ యం.ఎల్లయ్య యాదవ్,బిజెపి.పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాంచందర్, లయన్స్ ప్రముఖులు సూర్య నారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, విగ్రహాల కోసం హిందూ బంధువులు అనేకులు రావడం జరిగింది. మొత్తం 360 విగ్రహాలను పంచడం జరిగింది. 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న (నేటిది 14 వది) ఈ కార్యక్రమం పూర్వాపరాల గురించి అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిరంతరం సాగేలా కృషి చేస్తానని, సభ్యుల సహకారం అభినందనీయమని,గ్రామ పెద్దలు కూడా సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగతుంది అని పేర్కొన్నారు. మట్టి వినాయక ప్రతిమల ఆవశ్యకత, అవసరం గురించి ఎస్సైగారు,సంఘ కార్యక్రమాలను అభినందిస్తూ ఆకుల శ్రీ నివాస్, పి.మల్కారెడ్డి, ఎల్లయ్య, కె.రాంచందర్ లు ప్రస్తుతించారు. స్థానిక ఉద్యోగుల సంఘ భవనానికి గేటు ఏర్పాటు గురించి 15000 వేల రూపాయలు బిజెపి జిల్లాఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ విరాళంగా ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.