Take a fresh look at your lifestyle.

ఉపాధ్యాయుని ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళనం….

0

ఉపాధ్యాయులు పాండురంగారావుకు ఘనంగా వీడ్కోలు

ఎడపల్లి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : ప్రభుత్వ వివిధ శాఖలలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళనం తప్పదని పి ఆర్ టి యు (టి ఎస్) జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ఆంగ్ల మధ్యమ పాఠశాలలో విధులు నిర్వహించిన హిందీ పండిత ఉపాధ్యాయుడు పాండు రంగారావు ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్టియు (టీఎస్) జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, పి ఆర్ టి యు( టి ఎస్) ఎడపల్లి మండల శాఖ అధ్యక్షులు సాయిరెడ్డి, ఉపాధ్యాయ సంఘ నేతలు హాజరయ్యారు. మోహన్ రెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, ఎందరో విద్యార్థినీ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదే ఉపాధ్యాయులని ఆయన అన్నారు. పాండు రంగారావు విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ సహా ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడుగా నిలిచారన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి ఇటు పాఠశాల ఉపాధ్యాయుల, డివిజన్, జిల్లాస్థాయి సంబంధిత శాఖ అధికారుల ఉపాధ్యాయ సంఘం నేతల మన్నలను పొందారున్నారు. ఎడపల్లి ఉన్నత ఆంగ్ల మధ్యమ పాఠశాలలో పండితులుగా విధులు నిర్వహిస్తూ విద్యార్థినీ విద్యార్థులను మంచి స్థాయికి తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. అనంతరం ఎడపల్లి పి ఆర్ టి( టి ఎస్) అధ్యక్షులు సాయిరెడ్డి,తోపాటు ఎడపల్లి తాజా మాజీ సర్పంచ్. ఆకుల మాధవి శ్రీనివాస్, ఉద్యోగ విరమణ పొందిన పాండురంగారావు సేవలను కొనియాడారు. సహా ఉపాధ్యాయులతో పాటు పి ఆర్ టి (టి ఎస్) జిల్లా, ఎడపల్లి మండల శాఖ నేతలు, ఉపాధ్యాయులు, ఎడపల్లి నాయకులు, ఉద్యోగ విరమణ పొందిన పాండురంగారావు రచన దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళన సమావేశం రంగ రంగ వైభవంగా ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పి ఆర్ టి యు (టి ఎస్) ఎడపల్లి మండలం ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, సంఘ నేతలు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ఎడపల్లి తాజా మాజీ సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎస్ఎంసి మాజీ అధ్యక్షులు బర్దిపూర్ విట్టల్, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.