అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
బహుజన లెఫ్ట్ పార్టీ బి ఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్


ఎడపల్లి, నవంబర్ 13 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు, ధర్నాలో పాల్గొన్న దండి వెంకట్ మాట్లాడుతూ ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ గ్రామంలో గత 12 సంవత్సరాల నుండి ప్రభుత్వ సర్వే నెంబర్ 188/1 లో 50 కుటుంబాలు నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఎడపల్లి, అంబం (వై) గ్రామాల్లో 30 మంది జోగిని కుటుంబ సభ్యులకు 1987లో ఉమ్మడి రాష్ట్రంలో జోగిని వ్యవస్థ నిర్మూలనలో భాగంగా స్వంత ఇల్లు, సాగు భూముల కేటాయించిదని తెలిపారు. అంబం (వై)గ్రామంలో జోగిని కుటుంబ సభ్యులు కేటాయించిన కాలనీ శిథిలావస్థకు చేరినందున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి దండి వెంకట్ విజ్ఞప్తి చేశారు అనంతరంతాహసిల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని సమర్పించారు .కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బిడిఎస్ఎఫి జిల్లాఅధ్యక్షులు తలారే సంజయ్, బి ఎల్ పి బోధన్ డివిజన్ కన్వీనర్ డి,పోశెట్టి, డివిజన్ నాయకులు మూడు గ్రామాలకు చెందినపేదలు,తదితరులు పాల్గొన్నారు.