Take a fresh look at your lifestyle.

మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం….

0

మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం

ఎడపల్లి, సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను బుధవారం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు రహీం అలీ, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాదం ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు పోశెట్టి కార్యదర్శి రాజ్ కుమార్ కోశాధికారి జగన్మోహన్ సలహాదారు భుజంగ లింగం లతోపాటు కార్యవర్గ సభ్యులకు పూలమాలలు వేసి, శాలువలతో ఘనంగా సన్మానించి స్వీట్లు. పంపిణీ చేసిన అనంతరం ఎంఐఎం పార్టీ, అధ్యక్షులు రహీమ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభినందనలు తెలిపారు.ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు రహీం అలీ మాట్లాడుతూ,నూతనంగా ఏర్పాటైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ, మీడియా, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పరస్పరం కలిసి మండల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎం మండల ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ అబ్దుల్, కార్యదర్శి ఆసీఫ్, ఎంఐఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్రికేయులను సన్మానించిన వారిలో ఎంఐఎంపార్టీ నాయకులు 40 మంది వరకు ఉన్నారు పాత్రికేయులు విజయ్ గౌడ్ రవి నాయక్ కందునూరి గంగ శంకర్ సతీష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.