ప్రైవేట్ ఆసుపత్రి లో యువకుని మృతి…..
– వైద్యుల నిర్లక్ష్యం అంటున్న బాధితులు
నిజామాబాద్ క్రైమ్ , ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) : చెవి నొప్పితో వచ్చిన యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖలీల్ వాడిలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ చెవి నొప్పితో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చామన్నారు. అజయ్ ని చెక్ అప్ చేసిన చెవి వైద్య నిపుణులు ఆపరేషన్ చేయాలని సూచించాడు. ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేసుకుని మత్తు వైద్యున్ని పిలిపించి మత్తు ఇంజక్షన్ చేసి ఆపరేషన్ ప్రారంభించారని, రెండు మూడు గంటలైనా ఆసుపత్రి వైద్యులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం తో బాధిత కుటుంబ సభ్యులు నిలదీశామన్నారు. పది నిమిషాలు ఆగండి, పది నిమిషాలు ఆగండి అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు తెలిపారు. ఏదైనా ఉంటే చెప్పండి అడిగితే పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉందని ఆసుపత్రి వైద్యులు సమాధానం ఇచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తామని తెలపడంతో లేదు హైదరాబాద్ కు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపామన్నారు. కొద్దిసేపటి తరువాత నగరంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు సీరియస్ గా ఉందని ఏమి చేయలేమని అంతా అయిపోయిందని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే చికిత్స పొందిన ఆసుపత్రి ఉందో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి మృతదేహాన్ని ముందు ఉంచుకొని ధర్నాకు దిగారు. వైద్యులు నిర్లక్ష్యం తోనే మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ ఇలాంటి సౌకర్యాలు లేవని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు.