స్వచ్ఛత పై వాకర్స్ కు అవగాహన

నిజామాబాద్ అర్బన్ , సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సెక్షన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని మూడవ సర్కిల్ పరిధిలోని ఐటిఐ గ్రౌండ్ లో కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులతో స్వచ్ఛతా ర్యాలీ, స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. గ్రౌండ్ లో మొత్తం క్లినింగ్ చేయించి, ప్లాస్టిక్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి, ప్రమాదకరమైన వర్గాలుగా విభజించడం పై వాకర్స్ అసోసియేషన్స్ వారికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం శానిటేషన్ సూపెర్వైజర్స్, జవాన్లు SS శానిటేషన్ విభాగం ఎం ఐ ఎస్ ఆపరేటర్ శివరంజని రాం వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.