పేకాట స్థావరంపై దాడి, ఏడుగురు వ్యక్తుల అరెస్ట్
– ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ
ఎడపల్లి, అక్టోబర్ 21 ( లోకంతీరు ) : మంగళవారం రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఎడపల్లి ఏఆర్పి క్యాంప్ గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని తెలిసిన వెంటనే ఎస్ఐ ముత్యాల రమ తన సిబ్బందితో కలిసి అట్టీ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఏడుగురు వ్యక్తులను పేకాట ఆడుచుండగా పట్టుకొని వారి దగ్గర నుండి 10,550 రూపాయలను మరియు పేక ముక్కలను జాప్తు చేయడం జరిగింది.