Take a fresh look at your lifestyle.

ఎడపల్లి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యుత్ నివారణపై అవగాహన సదస్సు …..

0

ఎడపల్లి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యుత్ నివారణపై అవగాహన సదస్సు 

ఎడపల్లి, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత,ఉర్దూ మీడియం, పాఠశాలలో గురువారం విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ నగేష్ కుమార్ పాఠశాల విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణ తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల కు కే. నగేష్ కుమార్, ఎడపల్లి ఏఈ కిషోర్, శంకర్ ,ఎడపల్లి , సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ విద్యుత్ భద్రతపై (సేఫ్టీ) అవగాహన కల్పించారు.విద్యుత్వినియోగదారులు రైతులు, విద్యార్థులు, ఊరు పరిధిలో కనిపించిన వదులుగా ఉన్న, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు, వంగిన స్థంబాలు, లైన్ క్రాసింగ్ తదితర ప్రమాదకరంగా ఉన్నటువంటి వాటిని గమనించిన వెంటనే మీ పరిధిలోని సెక్షన్ ఆఫీసర్( అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్ ) , గ్రామ స్థాయిలో ఉండే లైన్ మెన్ కు తెలియ పరచాలన్నారు, 

విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగంగా ప్రమాద భరితంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించి జీరో ఆక్సిడెంట్ లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.భారీ వర్షాలు,గాలి దుమారాల వలన విద్యుత్ తీగలు తెగి పడితే వెంటనే సమాచారాన్ని విద్యుత్ఏఈ లకు తెలుపాలని ఆయన కోరారు. తడిగా ఉన్న స్థంబాలను ముట్టుకోకూదని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని ,ఇంటిలోకి వచ్చే సర్వీస్ వైర్ ఎటువంటి అతుకులు లేకుండాఅలాగే ఇనుప రేకుల గుండ వెళ్లకుండ చూడాలని వివరించారు. కరెంట్ పోల్ లకు బట్టలు అర వేయడానికి ఇనుప వైర్ దండెం లు కట్ట రాదన్నారు. సెల్ ఫోన్ ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించరాదు.

వినియోగదారుల గృహాలలో నాణ్యమైన వైరింగ్ వాడాలని , రైతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ ల దగ్గర భద్రత ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించాలని కోరారు .

ప్రతి ఇనుప విద్యుత్ పరికరాలను తప్పనిసరిగా సరిగా ఎర్థింగ్ చేయాలనీ పేర్కొన్నారు.రైతులు,వినియోగదారులు స్వయంగా కరెంట్ పనులను సొంతంగా చేసుకోకూడదని, తెలిపారు.ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన టీజీఎన్ పిడీ సిఎల్ టోల్ఫ్రీనెంబర్1912కుసంప్రదించాలని ఆయనకోరారు.అవగాహనాకార్యక్రమం లో ఉర్దూ మీడియం,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు ఖలీముద్దీన్, ఖదీర్ అహ్మద్, షేక్ ఫరీద్, రవి ,శంకర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్,సాయిబాబా, లైన్మెన్లు, పవన్, బాలరాజు,విద్యుత్ శాఖ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.