లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
ఎడపల్లి, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి, బోధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం లోని బ్రహ్మణపల్లి గ్రామంలోగురువారం డయాబెటిక్ క్యాంప్, ఉచిత మొబైల్, కంటి స్క్రీనింగ్ షిబిరాన్నినిర్వహించారు. కార్యక్రమం లోవైద్యులు అజయ్ సుమారు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 10మందికి మోతె బిందు ఉన్నట్లు నిర్ధారించారు. వారిని ఉచిత కంటి శస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ లయన్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. కార్యక్రమo లో లయన్స్ క్లబ్ఆఫ్ఎడపల్లిఅధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి మెర్సీ, కోశాధికారి శంకర్, జిఈటీ కోఆర్డినేటర్ సూర్యనారాయణ, గంగారెడ్డి,నార్ల కాశీనాథ్ గప్తా ,ప్రకాష్, మనోజ్, పిఆర్వో రాకేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.