ఎడపల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం
ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతన్నల పండించిన వారి ధాన్యం రాశులు తడిసి ముద్దాయి. ఎండిన ధాన్యం ఒక్కసారిగా వర్షo తాకిడికి నాని పోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపో మాపో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించేందుకు ఎండ పెట్టిన ధాన్యం మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి పూర్తిగా తడిసిపోయి నానా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వ్యక్తం చేస్తున్నారు. పకృతి వైపరీత్యాల వల్ల కురుస్తున్న వర్షాలకు రైతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వము కొనుగోలు చేయాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో ఆరుగాలం కష్టపడిన పంట నష్టపరిహారం తో పాటు తాము పండించిన పంట ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తప్పకుండా కొనుగోలు చేయాలని రైతన్నలు సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి సంబంధిత అధికారులను రైతన్నలు వేడుకుంటున్నారు.