Take a fresh look at your lifestyle.

పంట కాలువ మార్పుతో వరి పంట మొత్తం నీటిపాలు….

0

పంట కాలువ మార్పుతో వరి పంట మొత్తం నీటిపాలు

– న్యాయం చేయాలని కలెక్టర్ తాసిల్దార్ కు వినతి

ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) :  పంట కాలువను మార్చడం వల్ల గత రెండు సంవత్సరాలుగా పంట నష్టపోతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎడపల్లి గ్రామానికి చెందిన కంజరి హనుమండ్లు సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తోపాటు ఎడపల్లి తాసిల్దార్ దత్తా త్రీ కి వినతి పత్రం సమర్పించారు రైతు తెలిపిన వివరాల ప్రకారం ఎడపల్లి పెద్ద చెరువు ఆయకట్ట కింద నాలుగు ఎకరాల పొలం ఉందని గత రెండు సంవత్సరాలుగా శివారు ప్రాంతంలో కొందరు రైతులు ప్రధాన పంట కాలువను అక్రమంగా మార్చారు అని వారన్నారు ఈ మార్పు కారణంగా నీరు సరిగా వెళ్లక ఆయకట్టు చివర్లో ఉన్న తన పొలంలోకి నీరు చేరుకొని నాలుగు ఎకరాల పంట పూర్తిగా నీట మునిగి పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు కాలువమార్పు వల్ల కష్టపడి పండించిన పంట నాలుగు ఎకరాల వారి ధాన్యం నీటి పాలు అయిందని గత రెండు సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై గతంలో కూడా ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినట్లు రైతు తెలిపారు కాలువ మార్పును తక్షణమే నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి తాసిల్దార్ దత్తాత్రి కి వినతి పత్రం అందజేశానని అధికారులు వెంటనే స్పందించి పంట కాల్వ మార్పును సరిచేసి తమకు న్యాయం చేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.