జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో 2025 చెకుముకి సంబరాలు
నిజామాబాద్ అర్బన్, 30( లోకంతీరు ) : 2025 సంవత్సరానికి సంబంధించిన చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నవంబర్ 7న పాఠశాల స్థాయి, నవంబర్ 21న మండల స్థాయి, 28న జిల్లా స్థాయిల్లో జరిగే ఈ చెకిముకి సైన్స్ టెస్ట్ పోటీల గోడ ప్రతులను నగరంలోని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ డి.ఎల్.ఎస్.ఎ సెక్రటరీ ఉదయ్ భాస్కర్ చేతులమీదుగా ఆవిష్కరింప జేశారు.ఈ సైన్స్ టెస్ట్ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ సైన్స్ టెస్ట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఈ సందర్బంగా తెలిపారు.అనంతరం డి.ఎల్.ఎస్.ఎ సెక్రటరీ, జిల్లా జడ్జి ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ సైన్స్ టెస్ట్ లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ యొక్క సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం ఈ యొక్క సైన్స్ టెస్ట్ విద్యార్థులకు నిర్వహించడంతో విద్యార్థులలో ఉన్నటువంటి సైన్స్ టెంపర్ ని పెంచడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సందర్బంగా జన విజ్ఞాన వేదిక నాయకులను ఉదయ్ భాస్కర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్,జిల్లా అధ్యక్షులు ఖాజా ఉమర్ అలీ, గౌరవ అధ్యక్షులు బాస రాజేశ్వర్, శ్రీహరి ఆచార్య, కోశాధికారి కరిగె పండరి, న్యాయవాదులు అశోక్, ప్రదీప్, కిరణ్, మల్లాని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.