అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత
ఎడపల్లి, నవంబర్ 10 ( లోకంతీరు ) : ఎడపల్లి శివారులో సివిల్ సప్లై అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ (పిడి ఎస్) బియ్యాన్ని పట్టుకున్నారు నంబర్ ప్లేట్ లేని బొలెరో వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ మొహమ్మద్ షేక్ ఆల్ఫాన్ ను అదుపులోకి తీసుకున్నారు వారిపై కేసు నమోదు చేసినట్టు ఎడపల్లి ఎస్సై ముత్యాలరమ్మ తెలిపారు.