Take a fresh look at your lifestyle.

ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషి….ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

0

ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషి

  • సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్..!
  • వచ్చే ఎంపీ, స్థానిక ఎన్నికలలో విజయం సాధించాలి..!
  • ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాను..
  • ఎల్లారెడ్డి ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేరుస్తా..!
  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..!

కామారెడ్డి జిల్లా/ఎల్లారెడ్డి, జనవరి 26 ( లోకం తీరు ) :

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పథకావిష్కరణ అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అదేవిధంగా మదన్మోహన్రావు మాట్లాడుతూ
సుమారు 120 కోట్ల తో ఎల్లారెడ్డి నియోజకవర్గం కు మంజూరు చేయించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పథకం ఆవిష్కరించి 130 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేశారని గత పెండింగ్ పనులకు 45 కోట్ల రూపాయలను తాను స్వయంగా చొరవ చూపి మంజూరు చేయించానని మరో 50 కోట్ల రూపాయలు రోడ్లు భవనాల శాఖ ద్వారా రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంజూరు చేశారని 13 కోట్ల రూపాయలు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఈ నిధులతో ఎల్లారెడ్డిలో విద్యాసంస్థల నిర్మాణంకు రోడ్ల నిర్మాణంకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అన్నారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని వైద్యశాఖ విద్యాశాఖ శాఖలలో సమస్యలు పరిష్కరిస్తానని యువత ఉపాధికి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఒకే యాప్ లో పొందుపరిచి వాటన్నిటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఇందుకోసం ప్రత్యేక యాప్ ను నెలకొల్పినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పేర్కొన్నారు.

ఆ యాప్ ను ఆన్లైన్ లో ఎవరైనా చూసుకుని సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు వైద్య చికిత్సలకు ప్రాధాన్యమిస్తున్నట్లు సుమారు 20 లక్షల రూపాయల లెటర్ ఆఫ్ కాన్సెంట్ అయిదుగురు పేషెంట్లకు తీసుకొచ్చి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లకు ఎల్ఓసి వచ్చిందని మరో 100 ఎల్వోసీలు మరో రెండు మూడు రోజుల్లో తీసుకొస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ 100 రోజులలో 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తుందని 50 రోజులు పూర్తి కాకముందే ప్రతిపక్షాలు, మాజీ బిఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే విమర్శించారు. మహిళలకు బస్సు ఫ్రీ ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ గ్యారెంటీ హామీలను అమలు చేశామని ఫిబ్రవరిలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 50 రోజులు పూర్తికాకముందే మాజీ బిఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడానికి అధికారం పోయిందని నిరాశ నిస్పృహలతో విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ సక్తులతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ స్పష్టం చేశారు.

గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండాలని అలాంటి కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు గ్రామాల్లో ఉండాలని ప్రజల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ సాధించి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.
నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కృషిచేసి మెజారిటీ ఇవ్వాలని కోరారు. అమెరికాలో ఉంటాననే బిఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారన్ని తిప్పుకొట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ జిల్లా పరిషత్ మున్సిపల్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తున్నట్లు మదన్ మోహన్ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో బిఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీని పార్లమెంటు ఎన్నికల్లో తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి హామీలను నెరవేర్చడానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు.

పేదలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కోరారు. అసెంబ్లీలో అందరికన్నా ముందు మాజీ మంత్రి హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చెప్పారు.కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో , ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ఎంపీపీలు,మండలతాసిల్దారులు, ఎండిఓ లు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు,
కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.