Take a fresh look at your lifestyle.

ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారులకు సామాగ్రి అందజేత…..

0

ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారులకు సామాగ్రి అందజేత

ఎడపల్లి, నవంబర్ 26 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం బోధన్ డిఎల్పిఓ ఆధ్వర్యంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారులకు సహాయ అధికారులకు శిక్షణ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. మండలంలో 9 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రాలలోనే అనుబంద గ్రామాల అభ్యర్థు లు నామినేషన్ దరఖాస్తులను చేసుకోవచ్చన్నారు. నామినేషన్ పత్రాలను అధికారులు ఎన్నికల రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎడపల్లి ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ మన్మోహన్ శాస్త్రి, ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.