కస్తూర్బాగాంధీ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ.

కోటగిరి/బాన్సువాడ, మార్చ్ 13 ( లోకంతీరు ) :-కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలోని విద్యార్థులకు బుధవారం లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలు,పెన్నులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 30 మంది పదవ తరగతి విద్యార్థులకు వీటిని వారు అందజేశారు.ఈ సందర్భం గా లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్ష,కార్యదర్శులు హనుమంత రావు పటేల్,కప్ప సంతోష్ మాట్లాడుతూ.విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు.క్లబ్ మాజీ అధ్యక్షులు తెల రవికుమార్ మాట్లాడుతూ.విద్యార్థులు పరీక్షలను భయాందోళన గురికాకుండా రాయాలని అన్నారు.కస్తూర్బాగాంధీ విద్యార్థులు మండల స్థాయిలో అగ్రగామిగా నిలవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కస్తూర్బాగాంధీ ప్రిన్సిపాల్ సవిత,రాణి,కర్నే రూప,లైన్స్ క్లబ్ ప్రతినిధులు పెద్దకాపు శ్రీకాంత్,తెల్ల చిన్న అరవింద్, యోగేష్,బర్ల అర్పిత్,కస్తూరిబా ఉపాధ్యాయులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.