బ్రాహ్మణపల్లి లో యధావిధిగా అంగన్వాడి కేంద్రం

ఎడపల్లి, నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రం గత 12 రోజులుగా తాళం వేసి మూసి వేయడంతో గ్రామ ప్రజల సమాచారంతో అంగన్వాడి కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించారు బ్రాహ్మణపల్లి గ్రామంలో ముఖ్యంగా చిన్నారులు గర్భిణీలు బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గురువారం అంగన్వాడి కేంద్రాన్ని ఐ సి డి సి సూపర్వైజర్ సావిత్రి 12 రోజులుగా మూసి ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సిడిపిఓ ఆధ్వర్యంలో తెరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.