Take a fresh look at your lifestyle.

ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి…..

0

ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి

–  ర్యాలీలో పాల్గొన్న బిజెపి నాయకులు

ఎడపల్లి , నవంబర్ 29 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం ఎడపల్లి గ్రామానికి చెందిన కందగట్ల రామ్.చందర్  ఎన్నికల అధికారులకు సర్పంచిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందుగా ఆయన ఎడపల్లి గ్రామ పరిధిలోని శివాలయం ఆలయం నుండి మండల కేంద్రంలో నీ మంగళ్ పహాడ్  చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కందగట్ల రామచందర్ పూలమాల వేశారు.  డప్పు వాయిదాలతో ర్యాలీగా ఎడపల్లి లోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన నామినేషన్ కేంద్రంలోకి చేరుకొని నామినేషన్ ఎన్నికల అధికారులకు సర్పంచ్ అభ్యర్థిగా దాఖలు చేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. ఎడపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఏ సమస్య ఉన్న తనకు తెలిసినట్లయితే పరిష్కారం మార్గానికి పనిచేస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు అయితే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి పనులను తాను గెలిస్తే తప్పనిసరిగా ఎడపల్లి గ్రామాన్ని జిల్లా స్థాయిలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. ఎడపల్లి గ్రామ ప్రజలు యువకులు మహిళలు ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వలని సర్పంచిగా గెలిపిస్తే మీకు ప్రజాసేవకుడిగా పని చస్తానని ఆయన అన్నారు. రాజకీయంలోకి రాకముందే మండలంలోని పలు గ్రామాలలో తన వంతుగా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎడపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట భాజపా జిల్లా నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, చేతన్, కంటేడి గంగాధర్, ధ్యాకాం సాయి రెడ్డి. బీజేవై ఎడపల్లి మండల నాయకులు సాయి, గ్రామ యువకులు మహిళలు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.