Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండలంలో సర్పంచ్ వార్డ్ సభ్యుల నామినేషన్లు పూర్తి

0

ఎడపల్లి మండలంలో సర్పంచ్ వార్డ్ సభ్యుల నామినేషన్లు పూర్తి

ఎడపల్లి , నవంబర్ 29 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం మొదటి విడతలో ఉండడంతో నామినేషన్ స్వీకరణ గురువారం ప్రారంభమై శనివారంతో ముగిసింది మొదటి రెండు రోజులు నెమ్మదిగా ప్రశాంతంగా సాగిన ఎన్నికల ప్రక్రియ చివరి రోజు ఎన్నికల కేంద్రాల వద్ద అభ్యర్థులు భారీ రద్దీతో ఉత్కంఠ భరితంగా మారింది ఎడపల్లి మండలంలోని ఎన్నికల అధికారులు 17 గ్రామాలకు 9 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు చివరి రోజు అయిన శనివారం ఉదయం మొదలైన స్వీకరణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది మొదటి విడత ప్రక్రియ పూర్తి అయ్యేసరికి మొత్తం 17 సర్పంచ్ పదవిస్థానాలకు 110 సర్పంచుల నామినేషన్ అభ్యర్థుల నుండి స్వీకరించగా 116 వార్డులకు 389 అభ్యర్థులు నామినేషన్లు అందాయి ఎడపల్లి మండలంలో జనరల్ మహిళా స్థానమైన జానకంపేట గ్రామంలో అత్యధికంగా 13 నామినేషన్లు స్వీకరించబడ్డాయి బాపునగర్ గ్రామంలో కేవలం 2 నామినేషన్ మాత్రమే రావడం ఆ రెండు ఒకే అభ్యర్థి దాఖలు చేసి ఏకగ్రీవం సాధించారు వార్డు స్థానాల్లో కూడా బాపునగర్ ప్రత్యేక రికార్డ్ సృష్టించింది 8 వార్డులకు 8 మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అభ్యర్థులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎడపల్లి మండల కేంద్రంలో 14 వార్డులకు 51 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి అధిక సంఖ్యలో నిలిచారు శనివారంతో నామినేషన్ల స్వీకరణ తో ఎడపల్లి మండల ఎన్నికల మొదటి ఘట్టం ముగిసింది ఆదివారం ఉదయం నుండి అధికారులు పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.