బహిష్కరణలపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి
– జిల్లా జడ్జికి వివరించిన జర్నలిస్టు పొన్నాల చంద్రశేఖర్
ఆర్మూర్, డిసెంబర్ 06 ( లోకంతీరు ) : ఆర్మూర్ మండల న్యాయ చైతన్య సేవ అధికార సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి అధ్యక్షతన “న్యాయ చైతన్య సదస్సు” కార్యక్రమాన్ని ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించారు.“న్యాయ చైతన్య సదస్సు” కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ వివరిస్తూ.. ఆర్మూర్ లో కొందరు జర్నలిస్టులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి యదేచ్ఛగా అక్రమలకు పాల్పడుతూ వర్గాలుగా ఏర్పడి వసూళ్లు చేస్తున్నారని జిల్లా న్యాయమూర్తికి వివరించారు. గతంలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలుమార్లు ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి కోరగా ఆయన స్పందించి ఇరు వర్గాల జర్నలిస్టుల కలిసి ఉండాలని చెప్పినప్పటికీ ఏసీపి మాటలు లెక్క చేయకుండా ఇష్ట రీతిన వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని కోరడం జరిగింది. అందులో కొందరు జర్నలిస్టులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో ఏమవుతుందని అవహేళన చేస్తూ పత్రికలో ప్రచురించలేనటువంటి పదజాలాలు వాడరని చెప్పుకొచ్చారు.ఇలాంటి వారిపై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న అధికారుల గురించి పొన్నాల చంద్రశేఖర్ జిల్లా న్యాయమూర్తికి వివరించారు. ఆర్మూర్ లో నాలుగు జర్నలిస్టు క్లబ్ లు ఉన్నాయని జడ్జికి చెప్పారు. గతంలో అవినీతికి అక్రమవసులకు పాల్పడిన వ్యక్తులపై కేసులు జరిగాయని, అయినా కూడా ఏమాత్రం భయం లేకుండా కొందరు వ్యక్తులు అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జడ్జితో విన్నపించగా సానుకూలంగా స్పందించి ఇట్టి విషయాన్ని ఆర్మూర్ ఏసిపి తో చర్చిస్తానని అన్నారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నీరుగారుతుందని చెప్పగా ఇట్టి విషయంపై తమరు చొరవ తీసుకొని చట్ట ప్రకారంగా న్యాయం చేయాలని కోరడం జరిగింది. దీనితో జిల్లా న్యాయమూర్తి భారతలక్ష్మి సానుకూలంగా స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉందని ఆమె చెప్పారు. తగు న్యాయం మీకు జరుగుతుందని అన్నారు.