Take a fresh look at your lifestyle.

మరోసారి సేవ చేసే భాగ్యం ఇవ్వండి …

0

36 వ డివిజన్  బీజేపి  అభ్యర్థి  దాత్రిక రేవతి పరమేశ్వర్

నిజామాబాద్ , ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని 36 డివిజన్లో మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలని దాత్రిక రేవతి పరమేశ్వర్ అన్నారు. శనివారం బిజెపి కార్యకర్తలతో, యువతతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాత్రిక రేవతి పరమేశ్వర్ లు మాట్లాడుతూ గతంలో నాకు కార్పొరేటర్ గా చేసిన అనుభవం  ఉందని ,గతంలో చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయని అన్నారు. యువత కూడా దేశం బాగుండాలంటే , నగరం బాగుండాలంటే బీజేపీ ని గెలిపించాలని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా మీరు లేని లోటు ప్రస్తుతం మాకు కనిపించదని ఓటర్లు వారితో విన్నవించారు. గతంలో మీరు చేసిన పనులే గాని గత ఐదేళ్లుగా 36వ డివిజన్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మీరు గెలిచి మళ్లీ 36 డివిజన్ కు మరింత అభివృద్ధి చేయాలని ఓటర్లు ఆయనను విన్నవించారు. డివిజన్ ఓటర్ల స్ఫూర్తితో ముందుకెళ్లి, డివిజన్ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.