– కాంగ్రెస్ కు హిందువులు , ముస్లింలు రెండు కాళ్ళు లాంటి వాళ్ళు..
– డి .ఎస్ అడుగు జడల్లో నడుస్తా..ఆయన ఆశయాలు కొనసాగిస్తా…
– అందరికి అందుబాటులో నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేస్తా…
– విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్….

నిజామాబాద్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : జరగబోయో మున్సిపల్ కార్పోరేషన్ నిజామాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే మా ప్రధాన లక్ష్యం అని నిజామాబాద్ నగర కార్పొరేషన్ తొలిమేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు.ఆదివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మనకు జరగబోయే నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని అందరికి తెలిసిన విషయమే. ముచ్చటగా మూడోసారి కూడా లేడీస్ రిజర్వేషన్ రావడం జరిగింది. ఒకసారి బీసీ మహిళకు అవకాశం వస్తే , రెండోసారి ఒక ఎస్సీ మహిళలకు అవకాశం రావడం జరిగింది.ప్రస్తుతం ఓసి మహిళ కూ మేయర్ కు రిజర్వేషన్లు రావడం జరిగింది. డి శ్రీనివాస్ డిమాక్టివ్ అయినప్పటి నుండి నిజామాబాద్ కు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ హయాంలో డి. శ్రీనివాస్ ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజుకి అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది . ఒక సీరియస్ వ్యక్తి ఒక విజన్ తోని రెండు సంవత్సరాల క్రితమే గిరి గిసుకొని ఈ పలానా నెలలో ఈ ఫలానా తారీకు రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చూడగలిగినటువంటి ముందు చూపు ఉన్న వ్యక్తి పెద్దలు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటీవల కాలంలో గత రెండు రోజుల క్రితమే ఆయన నిజామాబాద్ కు వచ్చి ఆయన పబ్లిక్ ఉద్దేశించి మాట్లాడుతూ నిజామాబాద్ అభివృద్ధి కొరకు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచుటనన్నారు.దేశజం అభివృద్ధి జరగాలంటే అది ఢిల్లీలో కాదు గల్లీలో జరగాలని అన్నారు. రోడ్లు ,డ్రైనేజీ వ్యవస్థ,మంచినీటి వ్యవస్థ అన్ని జరగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకొని 24/7 గంటలు అందుబాటులో ఉండే ఏకైక లీడర్ ఎవరు అంటే అది కార్పొరేటర్ అనే వ్యక్తి అన్నారు. మనకు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని చాలా చోట్ల విజయం సాదించము. నిజామాబాదులో పెద్ద మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది . నా తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఈసారి మేయర్ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటేనే మనకు డెవలప్మెంట్ జరుగుతుందని అన్నారు. గతంలో నివసించేటువంటి సాయి నగర్ , గాయత్రి నగర్, ఇంద్రాపూర్ నాగారం ప్రాంతంలో విపరీతమైనటువంటి పాపులేషన్ పెరిగిందని అన్నారు. ముగ్గురు ఒక లైన్ వాటర్ సప్లై అండర్ గ్రౌండ్ ఒక లైన్లో కూర్చొని మాట్లాడుకొని మన నిజామాబాద్ డెవలప్మెంట్ దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు. రేటింగ్ ప్రోగ్రాం సెలెక్ట్ చేసుకుని కర్ణాటకలో సుమారు ఆరు రోజులు ట్రైనింగు అటెండ్ చేయడం జరిగిందన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు అలాగే మన మేయర్ కాండేట్ గారి భర్త నరేందర్ రెడ్డి కూడా ఫోన్ చేసి నీ అవసరం ఉంది అని చెప్పారు. దయచేసి ఎక్కువ సమయం లేదు రేపు సోమవారం చివరి రోజు ప్రచారం ఉంటుంది కాబట్టి నా అవసరమైన స్థానంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బుధువారం జరిగే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కి ఓటువేసి గెలిపించాలని ఆయన పిలుపు నిచ్చారు.