Take a fresh look at your lifestyle.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పోలీస్ కమిషనర్ సాయిచైతన్య…..

0

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పోలీస్ కమిషనర్ సాయిచైతన్య

ఎడపల్లి , సెప్టెంబర్ 09 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని నిజాంబాద్ సిపి సాయి చైతన్య సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధికారులు, పురోహితులు కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యకు సాధారణ స్వాగతం పలి కారు పూజలు నిర్వహించిన అనంతరం సాయి చైతన్య ఆలయ పవిత్ర విశిష్ట,  ప్రాముఖ్యతను, ఆలయ అధికారులతో పాటు పురోహితులను అడిగి తెలుసుకున్నారు.దక్షిణ భారతదేశంలోనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచిందని, ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలతో పాటు, శనివారం అమావాస్య శనివారం, అష్ట మి ,పౌర్ణమి, పర్వదినాలలో భక్తులు  సు దుర ప్రాంతాల నుండి తరలివచ్చి స్వామివారికి మొక్కులను  తీర్చుకుంటారు. ఏది ఏమైనప్పటికి సాయి చైతన్య స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీసుకున్నారు. ఆయన వెంట ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తో పాటు ఎడపల్లి పోలీస్ సిబ్బంది , ఆలయ కమిటీ అధికారులు, వేణు, జూనియర్ అసిస్టెంట్, రఘు, పు రోహితులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.