Take a fresh look at your lifestyle.

బీజేపీతోనే మహిళా సాధికారత సాధ్యం….

0

బీజేపీతోనే మహిళా సాధికారత సాధ్యం 

– ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్

ఎడపల్లి,, డిసెంబర్ 23 ( లోకంతీరు ) : భారతీయ జనతా పార్టీ తోనే మహిళా సాధికారత సాధ్యపడుతుందని అయితే మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు జల్ జీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అందించడం అభినందనీయమని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్ స్పష్టం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో గత నెల రోజుల నుండి మహిళలకు జల్ జీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని నిర్వహించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ ముగిసిన సందర్భంగా మహిళలకు ఎడపల్లి సర్పంచ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళా శక్తి ఎంతో అపారమైందని మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా దృష్టి సారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పెద్దపీట వేయడం జరుగుతుందని అందులో భాగంగానే ముద్ర రుణాలను అందించడం జరిగిందన్నారు. ఆర్థిక స్వాలంబన కోసం మహిళలు ఇలాంటి ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. ఎడపల్లి గ్రామంలో సైతం మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జల్ జీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సీఈవో రవికుమార్, రెడ్డి కా సంఘం అధ్యక్షులు ప్యాట గంగాధర్, నాయకులు లక్ష్మణ్ గౌడ్, న్యావనంది రాజు, కోఆర్డినేటర్ ఆదిలక్ష్మి, శిక్షకులు ద్యాకం జ్యోతి, కీర్తన, శిక్షణ తీసుకున్న మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.