పోగొట్టుకున్న /చోరికి గురైన 170 మొబైల్ ఫోన్లో పట్టివేత
-
వాటి విలువ సుమారు 17 లక్షలు : నిజామాబాదు ఎ.సి.పి వెల్లడి
-
నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఈ మధ్య కాలంలో పోగొట్టుకున్న , చోరికి గురైన 170 మొబైల్ ఫోన్లను (సుమారు 17 లక్షల రూపాయల విలువగల) బాధితులకు అందజేత.


నిజామాబాద్ , డిసెంబర్ 03 ( లోకంతీరు ) : జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి నిజామాబాద్ , డివిజన్ గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు 17 లక్షల రూ. విలువ గల 170 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి ఈరోజు సంబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ , డివిజన్ గారు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని , మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్ , పాస్ వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి , వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే ,గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు.ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల (https://www.ceir.gov.in) నందు బ్లాక్ చేసి , సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని , తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.