ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల వార్షిక దినోత్సవ వేడుకలు
• ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ
• ప్రధాని కాగానే నెలరోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన నరేంద్ర మోదీ

కామారెడ్డి జిల్లా/ రామారెడ్డి, జూలై 7 ( లోకంతీరు ) : మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు బి.ఎన్ రమేష్ కుమార్ మాదిగ దండోరా 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య మాట్లాడుతూ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ దండోరా స్థాపించి 30 సంవత్సరాల నిండిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు.
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్ లక్షలాది మంది నిండు సభలో ప్రధానమంత్రిగా కాగానే నెలరోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిన కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం లేదని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మూడు కమిటీలు వేయడం జరిగిందని , మరొక కమిటీ ఎందుకని తెలంగాణ రాష్ట్ర కోసం శ్రీకృష్ణ కమిటీ ఒకటే వేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే బిజెపి పార్టీ నాయకులు కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి వర్గీకరణ చేయాలని లేనిపక్షంలో రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు బిజెపి పార్టీ కార్యాలయాలు మంత్రి ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడిస్తామని తెలిపారు.
ఇప్పటికైనా వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ము ఈశ్వర్ ,కోటి అశోక్, నవాబ్ మహేష్ ,పోచయ్య, రామచంద్రం ,రియాజ్ ,నిర్సర్ లక్ష్మణ్ చారి, బలరాం, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్వాయి గ్రామంలో ఆ గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని సంఘ సభ్యులు పాల్గొన్నారు.