నిజామాబాద్ పసుపు రైతులను మోసం చేసిన బిజెపి ప్రభుత్వం

వేల్పూర్, జులై 25 ( లోకంతీరు ) : ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మరోసారి తెలంగాణ పసుపు రైతులని మరియు ముఖ్యంగా నిజామాబాద్ పసుపు రైతులని అదేవిదంగా రెండవసారి గెలిచిన నిజామాబాద్ ఎంపీ బిజెపి ప్రభుత్వం మోసం చేసింది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ నిజామాబాద్ మీటింగ్ లలో ప్రకటన చేసి ఇన్ని రోజులు అవుతున్న ఇప్పటివరకు దాని యొక్క ఊసు ఇంతవరకు లేకుండా పోయింది కనీసం ఇప్పటివరకు ఎక్కడ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయలేదు దీన్ని బట్టి చూస్తే పసుపు బోర్డు మాట మోసపూరితమైన వాగ్దానం అని తెలిసిపోయింది. కేంద్రం నిన్న ప్రవేశపెట్టి బడ్జెట్లో రైతులకు తీవ్రమైన నిరాశ మిగిలింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గానీ రైతులను ప్రోత్సహించే విధంగా బిందు సేద్య పరికరాలు గాని ఇంకా ఏ విధమైన పథకాలకు నిధులు కేటాయించకుండా మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఆరుగురు ఎంపీలు ఉన్నాగాని తెలంగాణ రైతుల్ని ఆదుకోవడంలో విఫలమైనారు చేతకాని మంత్రులు ఎంపీలు మరియు ముఖ్యంగా రెండవసారి మోసపూరిత వాగ్దానం చేసి గెలిచిన ధర్మపురి అరవింద్ రాజీనామా చేసి రైతులకు క్షమాపణ చెప్పి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొని పసుపు బోర్డు తీసుకురావాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన తెలిపి నిన్ను నిలధిస్తాం అని హెచ్చరిస్తున్నం.
ఇట్టి కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, తక్కురి దేవేందర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అల్లాకొండ రాజేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సుంకేట భూచ్చన్న పాలేపు నర్సయ్య, ఉట్నూర్ ప్రదీప్ సుంకేట శ్రీనివాస్, కొమ్ముల రాజేందర్ సింగిరెడ్డి శేఖర్ జగదీశ్, రేవతి గంగాధర్, మోహన్ నాయక్ వేముల గంగారెడ్డి తెడ్డు రమేష్ నల్ల గణేష్,సాయి, పూజారి శేఖర్,రవీందర్ ఆనంద్ నరేందర్,పాషా గణేష్ బోనగిరి లక్షమన్ మణికంఠ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు