ఎమ్మెల్యే ను కలిసిన మండల అధ్యక్షులు
– గొల్లపల్లి లక్ష్మా గౌడ్
రామారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ను కలిసి వివిధ గ్రామాల సమస్యలు వివరించిన కాంగ్రెస్ పార్టీ కమిటీ మండల అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్ రామారెడ్డి గ్రామంలోని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నీటి సమస్య తీర్చుటకు , నూతన బోర్లు మంజూరు చేయుట గురించి మరియు అట్టి బోర్లకు నూతన మోటర్లు గురించి,గంగమ్మ వాగు దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తికానందున ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే వెంటనే డిఈ తో మాట్లాడడం జరిగింది. పనులు తొందర్లో పూర్తి చేయాలని డిఈ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.కన్నాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యము , మరియు నూతన బోర్ల గురించి వివరించడం జరిగింది.కన్నాపూర్ లంబడి తండా గ్రామాని నీటి సమస్య తీర్చుటకు నూతన బోర్లు మంజూరు చేయడం గురించి,గోకుల్ తాండ గ్రామానికి నీటి సమస్య ఉన్నందున నూతన బోర్లు మరియు మోటార్లు మంజూరు గురించి,గొల్లపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి,నీటి సమస్య గురించి ఎమ్మెల్యే కి వివరించడం జరిగింది.పై సమస్యలన్నీ విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే బోర్లు మంజూరు చేయుటకు ఒప్పుకున్నారు. అదేవిధంగా కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడడం జరిగింది. వెంటనే గొల్లపల్లి గ్రామానికి, కన్నాపూర్ గ్రామానికి బస్సు నడిచేలా చూడాలని కోరడమైనది. పై సమస్యలన్నింటికీ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.