Take a fresh look at your lifestyle.

నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా భాస్కర్ రెడ్డి….

0

నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా భాస్కర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా బొల్లారం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పీజీహెచ్ఎం భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు నియామక ఉత్తర్వులను జారీ చేయడంతో గురువారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇంచార్జీ మండల  విద్యాశాఖ అధికారిగా ఉన్న వెంకటేశం ఎల్లారెడ్డి ఎంఈఓ గా విధులు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మండల విద్యాధికారిగా నన్ను నియమించినందుకు చాలా సంతోషకరమని మండలంలోని ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు విద్యార్థులకు మెరుగైన విద్య నాణ్యమైన భోజనం ఉపాధ్యాయుల సమయపాలన పై దృష్టి సాధించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏ సమస్యలు ఉన్న సకాలంలో పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేకూరుస్తానని ఆయన అన్నారు.విద్యాధికారిగా నియమితులైన భాస్కర్ రెడ్డిని మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందనలు తెలిపి ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి, వెంకట రెడ్డి, వెంకటరాజు,అబ్దుల్ జబీన్ పీఆర్టియు టియస్ రాష్ట్ర సహద్యక్షులు పుట్ట శ్రీనివాస్ రెడ్డి,జిల్లా బాధ్యులు నరసింహ రెడ్డి , జయరాంరెడ్డి,చంద్ర మోహన్,మండల అధ్యక్షులు వాసుదేవరావ్,ప్రధాన కార్యదర్శి సుకుమార్ గౌడ్,ప్రసాద్,విజయ,వినీల్ కుమార్,దిగంబర్, కిష్టయ్య సిఆర్పిలు రాజు, కృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.