Take a fresh look at your lifestyle.

పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి….

0

పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి

  • పీ.డీ.యస్.యు డిమాండ్

  • ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి- నామాల ఆజాద్ పీ.డీ.యస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

    నిజామాబాద్, అక్టోబర్ 15 ( లోకంతీరు ) : రాష్ట్రంలో గత మూడు ఏళ్ల నుండి రూ.6వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని పీ.డీ.యస్.యు.ఆధ్వర్యంలో నిజామబాద్ నగరంలో ఎన్.ఆర్. భవన్ కోటపల్లి ఆఫీస్ లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీ.డీ.యస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేసి సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం విద్యారంగం పట్ల అనుసరిస్తున్న విధానాలు అవలంబిస్తుందన్నారు. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ & రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో తీవ్ర అలసత్వం వహిస్తుందన్నారు.గత 3ఏళ్లుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఇప్పటికే చాలా రకాల ప్రవేశ పరీక్షలు పూర్తి అయ్యి ఉన్నత చదువులకు వెళ్ళెవారికి తీవ్ర ఇబ్బందులు, ఎదురవుతున్నాయన్నారు. పేద విద్యార్థులు అప్పులు చేసి మరీ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారని తెలిపారు. ఒక్క ప్రక్కన విద్యార్థులు ఇబ్బందులు, మరోవైపు యాజమాన్యాలు అప్పులు, జీతాలు చెల్లించలేమని సోమవారం నుంచి కళాశాలల బంద్ కు పిలుపునివ్వడ బాధాకరమన్నారు. ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నష్టం లేకుండా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని డిగ్రీ, పిజి కళాశాలలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులు ఉన్నారన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి వలన వారు తీవ్రంగా నష్టపోతారని, ఒక్క ప్రక్కన విద్యలో విప్లవాత్మక మార్పులంటూ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం చేస్తూనే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను విడుదల చేయక పోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో ఉన్నత విద్యారంగానికి ప్రాధాన్యత తగ్గించి విద్యను నిరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేని ఎడల విద్యార్థి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పీ.డీ.యస్.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, జిల్లా నాయకులు మహిపాల్, నాయకులు మమత, నజీర్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.