భీంగల్ మండల పరిషత్ ను సందర్శించిన జిల్లాపరిషత్ సిఈఓ
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 ( లోకంతీరు ) : భీంగల్ మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీమతి బి ఉష సందర్శించినారు.ఈ సందర్శనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధన ప్రకారం ఖర్చు చేయాలని మరియు పెండింగ్లో ఉన్నటువంటి పనులను వెంటనే పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ సంతోష్ కుమార్ తెలిపినారు మరియు బాబా పూర్ పల్లె ప్రకృతి వనం నర్సరీని సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సూపరిండెంట్ శ్రీ శ్రీనివాస రావు సీనియర్ అసిస్టెంట్ నవీన్ తో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ఎంపీ ఓ జావిద్, సూపరిండెంట్ భీమయ్య, సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్, ఉపాధి హామీ ఎపిఓ జి నర్సయ్య మరియు మండల కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.