కాలనీలో సమస్య పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్

ఎల్లారెడ్డి, నవంబర్03 (లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని రెండవ వార్డ్ లో నెలకొన్న నీటి పైపు లీకేజ్ సమస్యను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిష్కారించారు. వార్డులోని పాత మమత హోటల్ మెయిన్ రోడ్డు నుంచి మహేందర్ గౌడ్ టీచర్ ఇంటికి వెళ్లే దారిలో నెలకొన్న వాటర్ పైపు లీకేజీ సమస్యను ఇటీవల స్థానికులు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ద్రుష్టికి తీసుకురాగా..స్పందించిన ఆయన.. రోడ్డుపై నెలకొన్న వాటర్ పైపు లీకేజీ పనులను మున్సిపల్ సిబ్బందితో చేయించారు. సమస్యకు పరిష్కారం చూపడంతో మున్సిపల్ చైర్మన్ కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే తమ కాలనీకి నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.