Take a fresh look at your lifestyle.

ఖాకీల కళ్లుగప్పి పాన్ గల్లీలో జోరుగా జూదం……..

0

ఖాకీల కళ్లుగప్పి పాన్ గల్లీలో జోరుగా జూదం

ఎడపల్లి , జనవరి 31  ( లోకంతీరు )  : బోధన్ పట్టణంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని పాన్ గల్లీ ప్రాంతంలో నిత్యం జోరుగా పేకాట సాగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ ప్రాంతంలో పేకాట స్థావరాలు వెలుస్తూనే ఉండటం గమనార్హం. జూదగాళ్లకు అసలు పోలీసులంటే భయం ఉందా లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా సాగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.