Take a fresh look at your lifestyle.

మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు….

0

మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు 

ఎల్లారెడ్డి, జనవరి 14 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు పాడి పంటలతో తులతూగి, ఆయా రంగాల్లో శ్రేయస్సు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకని ఈ పండుగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని తెలిపారు. ప్రజలందరూ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు, స్వీయ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆశీస్సులతో పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందం నింపాలని, సుఖ సంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.