భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో పారిశుద్ధ్య లోపంతో ఈగలు దోమల వలన భూంపల్లి గ్రామంలో చాలామంది విష జ్వరాల బారిన పడ్డారు. ఇది తెలుసుకున్న మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు పర్యటించిన విషయం విధితమే. బుధవారం జిల్లా వైద్యాధికారులు తక్షణమే స్పందించి భూంపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి బాధితులను గుర్తించి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, విష జ్వరాల పరీక్షలు నిర్వహించరు.తక్షణ కర్తవ్యం గా రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ ని చల్లడం జరిగింది.దోమలు, ఈగల నివారణ మందులను పిచికారి చేశారు.రాజేశ్వర్ రావు పూర్తి పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ లో నిధులు లేవని పంచాయతీ కార్యదర్శి నరేందర్ చెప్పడం తో రాజేశ్వర్ రావు రోడ్లకు మొరం, గడ్డి మందు, దోమల మందు తెప్పించారు. రోడ్డుకు ఏర్పడిన గుంతలను, నీటితో నిల్వ ఉన్న గుంతలను మొరం తో పుడిచి వేయించారు.సమస్య ను పరిష్కారం చేసినందుకు మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు కి వైద్య అధికారులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రాంతీయ డాక్టర్ హస్మా,వైట్ల శ్రీనివాస్, ఏఎన్ఎం సంగీత, ఆశవర్కర్ రాధ, గ్రామం కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారు.