Take a fresh look at your lifestyle.

గ్రామ సభలో గోల గోల…ఇదేనా ప్రజా పాలన

0

గ్రామ సభలో….. గోల గోల …

– రాజకీయ స్వార్థము కొరకే 

– తెల్ల పేపర్లు పంపిణీ…

డిచ్ పల్లి, జనవరి 23 ( లోకంతీరు ) : ఎవరి స్వార్థం వారిది,ఎవరి గోల వారిది,తప్పించు కునేందుకు అధికారులు తెల్లపేపర్ల పంపిణీ చేసి పేర్లు నమోదు చేసుకున్న వైనం.ఇదంతా నిజామాబాద్ రూరల్ లో నియోజకవర్గములో గల డిచ్ పల్లి మండలంలో ని ఘనపూర్ గ్రామంలో గ్రామ సభలో జరిగింది. గురువారం ప్రజాపాలన కార్యక్రమం లో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ లబ్దిదారులు ఎంతమంది ఉన్నారు అని తెలియక పోవడంతో గ్రామస్తులు అధికారులను నిలదీశారు.దింతో గ్రామసభ నుండి తప్పించు కునేందుకు తెల్ల పేపర్లు పంచి పేర్లు నమోదు చుకున్నారు. . ఉన్న వారికే సంక్షేమ పథకాలు వర్తిస్తాయా నీరు పేదలకు వర్తించవా అని ప్రజలు అధికారులను నిలదీశారు. స్థానికుల వివరాల ప్రకారం ప్రభుత్వం ఇచ్చే ఈ నాలుగు పథకాలు కూడా లేని వారి కంటే ఉన్నవారికే చెందుతున్నాయి అంటున్నారు. ఘనపూర్ గ్రామసభలో ఎంపిడిఓ, సెక్రటరీ, పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ అనుకోగా స్థానిక కాంగ్రెస్ పార్టీ వారు అక్కడికి వచ్చి గ్రామసభను కాస్త గోలసభ గా చేయడం విశేషం అని స్థానికలు అంటున్నారు.ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు ఈ విషయంలో పట్టించుకుని అసలైన లబ్ధిదారులకు గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అందేవిదంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు , గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.