కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్ దరఖాస్తుల కార్యక్రమం

ఎడపల్లి, మే 05 ( లోకంతీరు) : ఎడపల్లి మండలంలో ని ధర్మారం వడ్డేపల్లి గ్రామాలలోని గ్రామపంచాయతీలను కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ దరఖాస్తుల కార్యక్రమo సోమవారం ప్రారంభమైంది. సోమవారం రైతులు మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి దరఖాస్తులను చేసుకున్నారు. రైతులు సమర్పించిన దరఖాస్తు ఫారాలను వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు పరిశీలించారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకం తో పాటు ఆధార్ కార్డు బ్యాంకుకు అనుసంధానం ఉన్న ఫోన్ నెంబర్లను రైతులు సంబంధిత అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి, సిద్ది రామేశ్వరరావు, విస్తీర్ణ అధికారులు జ్యోతి, శ్రీహరి,, గ్రామపంచాయతీ సిబ్బంది, గుణ తేజ, రైతులు పే సరి ఆంజనేయులు, గోవింద్, రైతులు తదితరులు ఉన్నారు.