ఎడపల్లి నర్సరీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్

ఎడపల్లి, జూన్ 25 ( లోకంతీరు) : ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని గ్రామపంచాయతీ నర్సరీని బుధవారం ట్రైనీ కలెక్టర్ కారోలిన్ చింగితియన్ మావి సందర్శించారు నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు మొక్కల సంరక్షణకు ప్రత్యేక చొరవ చూపాలని కార్యదర్శిని ఆదేశించారు వన సంపదలను పెంపొందించేందుకు గ్రామ కార్యదర్శిలు కదం తొక్కాలని సూచించారు