ఎడపల్లి గ్రామ అధ్యక్షుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
ఎడపల్లి, సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంజ కామప్ప సతీమణి బంజ నాగబాయి సుమారు ఐదు రోజుల క్రితం మృతి చెందారు. సోమవారం ఎడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బంజ కామప్పనివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు, భోదన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు కరటూరి సత్యనారాయణ, నెహ్రు నగర్ మాజీ సర్పంచ్ అమానుల్లా షరీఫ్, నాయకులు బొబ్బిలి శ్రీనివాస్, తూటుకూర రవీందర్ రెడ్డి, గోపి, ఐరండ్ల నవీన్, కంచరి శ్రీనివాస్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.