Take a fresh look at your lifestyle.

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్…..

0

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

ఎడపల్లి, సెప్టెంబర్ 09 ( లోకంతీరు ) : బోధన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రోజు మధ్యాహ్నం సమయంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., గారు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది.ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫామ్ టర్న్ అవుట్ మరియు కిట్ ఆర్టికల్స్ చెకింగ్ చేయడం జరిగిందితదుపరి గౌరవనీయులు పోలీస్ కమిషనర్ గారు బోధన్ ఏసిపి, బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ , బోధన్ రూరల్ ఎస్సై , లతో సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహించారు. పోలీస్ విభాగము నిర్విరామముగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు ఇవ్వడం జరిగింది.బోధన్ రూరల్ పిఎస్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ , అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని , ప్రతి కేసులో నాణ్యమైన , ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారుఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు , కళాశాలలో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారుపోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి , అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలి అన్నారు.ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్ట పరిచి అక్కడి పోలీసు సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారిచేసారుప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు.సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ, సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారుఅనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని , దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని , సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారుఈ సందర్భంగా బోధన్ ఏ.సి.పి శ్రీ పి. శ్రీనివాస్ , బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయ్ బాబు , బోధన్ ఎస్హెచ్ఓ శ్రీ వెంకట నారాయణ , బోధన్ ట్రాఫిక్ సిఐ శ్రీ చందర్ రాథోడ్ , బోధన్ రూరల్ జె. మచ్చేందర్ , ఏడపల్లి ఎస్సై ముత్యాల రమ , రెంజల్ ఎస్సైచంద్ర మోహన్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.